![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-38లో రాజ్ కావ్యల పెళ్ళి జరుగుతుంది. అసలు పెళ్ళి అవుతుందో కాదో అని అనుకున్నారంతా కానీ జరిగింది. మీ ఇద్దరికి పడిన ఈ బ్రహ్మముడిని ఆ బ్రహ్మ కూడా విడదీయలేడు అని పెళ్ళి జరిపించిన పంతులు చెప్తారు.
ఆ తర్వాత అప్పగింతలు మొదలవుతాయి. కావ్యని పంపించే ముందు అందరూ ఏడుస్తుంటారు. "తెలిసో తెలియకో మీ అమ్మ తప్పు చేసింది. ఇందులో నా అసమర్థత కూడా ఉంది అమ్మా.. కూతుళ్ళని నాకు ఉన్నంతలో పెళ్ళి ఘనంగా చేసి గొప్పింటికి కోడళ్ళుగా పంపించాలానుకున్నా కానీ ఇలా కన్నీళ్ళతో సాగనంపాల్సి వస్తుందనుకోలేదు" అని కృష్ణమూర్తి కావ్యతో చెప్తాడు. ఏడ్వకండి నాన్న అని కావ్య ఓదార్చుతుంది.
కనకం వాళ్ళ అక్క కూడా కావ్యకి అత్తింట్లో ఎలా ఉండాలో చెప్తుంది. "ఇప్పుడు మనం తప్పు చేసాం.. వాళ్ళు మనల్ని మోసం చేసామని అంటారు. ఇక నుండి అత్తిళ్ళే నీకు పుట్టిల్లు.. మీ భర్తకి నీ మీద కోపం ఉంది. వాళ్ళ కుటుంబానికి మనం మోసం చేసామనే బాధ ఉంది. వాళ్ళు ఏమన్నా పట్టించుకోకమ్మా" అని కనకం వాళ్ళ అక్క కావ్యకి చెప్తుంది. మరోవైపు రాజ్ పెళ్ళి కోసం ముస్తాబు చేసిన కార్ లో కూర్చొని "పదా వెళ్దాం" అంటే కార్ ముందు సీట్ లో ఉన్న కళ్యాణ్.. "ఎక్కడికి?.. మనం పెళ్ళికూతురితో ఇక్కడి నుండి వెళ్ళకుంటే మనకుందా ముందు మీడియా మన ఇంటి ముందు ఉంటుంది. పెళ్ళి కూతురిని వదిలేసి వెళ్ళిన రాజ్ అని న్యూస్ హెడ్ లైన్ లో వస్తుంది" అని చెప్తాడు. దాంతో రాజ్ సైలెంట్ గా ఉండిపోతాడు. ఆ తర్వాత కావ్య కార్ లో ఎక్కగానే బయల్దేరుతారు. కావ్య అక్క వస్తువులు మర్చిపోయిందని అప్పు ఆ వస్తువులు ఉన్న సంచీ తీసుకొని కార్ వెనుకాలే పరుగెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |